: ఆ గొంతు చంద్రబాబుదే... వాంగ్మూలంలో స్టీఫెన్ సన్!
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న తన వాంగ్మూలాన్ని కోర్టు ముందు వినిపించారు. హైదరాబాదు మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ముందు ఆయన దాదాపు గంటన్నర పాటు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా తనతో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడేనని ఆయన కోర్టుకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ‘భయపడాల్సిన పనిలేదు. నేనున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలిసి పనిచేద్దామంటూ ఆహ్వానించారు’’ అంటూ స్టీఫెన్ సన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారట. స్టీఫెన్ సన్ తో పాటు ఆయన కుమార్తె జెస్సీకా, స్నేహితుడు మార్క్ టేలర్ ల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, నేడు సదరు వాంగ్మూలాలను ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించనున్నారు. ఈ వాంగ్మూలం వివరాలు బయటకు వస్తే కేసులో మరింత దూకుడు పెంచేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది.