: ఊరికో కోడి... ఇంటికో ఈకా కూడా ఇవ్వలేరు: కేసీఆర్ పై సీపీఐ నేత విసుర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ నిన్న విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్న కేసీఆర్... ఊరికో కోడి, ఇంటికో ఈక కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ యాస, భాష నేర్చుకున్న కేసీఆర్, ప్రజలను మెస్మరైజ్ చేస్తూ పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యారంగ సమస్యలపై హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా గుండా మల్లేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.