: ప్రైవేట్ హాస్టళ్లలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్...ఎస్ఆర్ నగర్ లో 15 మంది అరెస్ట్
హైదరాబాదు నగరంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలకు తెరతీసిన నగర పోలీసులు, ఇప్పటికే నగరంలోని పలు కాలనీలను జల్లెడ పట్టారు. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నగరంలో మెజారిటీ ప్రైవేట్ హాస్టళ్లున్న ఎస్ఆర్ నగర్ లో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మూకుమ్మడి సోదాలకు దిగడంతో హాస్టళ్ల నిర్వాహకులతో పాటు, వాటిలోని బ్యాచిలర్స్ కూడా బెంబేలెత్తిపోయారు. గంటల తరబడి సాగిన సోదాల్లో 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.