: తుమ్మల నాగేశ్వరరావుతో మొదలుపెట్టారు: ఎర్రబెల్లి


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఏసీబీ అధికారులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ... గత ఆరు నెలలుగా తమ పార్టీ శాసనసభ్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరగాలని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో మొదలుపెట్టారని, టీడీపీ నేతలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి కేసీఆర్ మూడు సార్లు వెళ్లారని, ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. తలసాని ఇంటికి వెళ్లి కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News