: టీఆర్ఎస్ నేతలపై కేసు పెట్టేందుకు తెలంగాణ ఏసీబీ ఆఫీసుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు!
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్ రెడ్డి తెలంగాణ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. వారివెంట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ లో చేరాలని తమపై ఒత్తిడి చేస్తున్న వారిపై కేసు పెడతామని వారు తెలిపారు. ముఖ్యంగా, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో చేరితే నిధులు, పదవులు ఇస్తామని తమను ప్రలోభపెట్టారని పేర్కొన్నారు. పార్టీలో చేరకుంటే నియోజకవర్గ డెవలప్ మెంట్ కు సహకరించబోమన్నారని, పార్టీ మారితే కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పారని వివేక్ వెల్లడించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరగానే రూ. 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు.