: అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు... జపాన్, సింగపూర్ ప్రధానులను ఆహ్వానించాలని నిర్ణయం
బుధవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. అక్టోబర్ 22న నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు జపాన్, సింగపూర్ ప్రధానులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక, విజయవాడ మెట్రో రైలు వ్యవస్థను మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఓటుకు నోటు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రులకు సూచించారు.