: ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు రాసిన లేఖలు మా వద్ద ఉన్నాయి: అచ్చెన్నాయుడు


ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటుకు నోటు వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సర్కారు అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరుకుందని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేసీఆర్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసివ్వగలదా? అంటూ ప్రశ్నించారు. తాము అల్లాటప్పాగా మాట్లాడడం లేదని, పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఇక, చంద్రబాబు మాట్లాడారని చెబుతున్న ఆడియో టేపులు ఎక్కడివని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆ వాయిస్ ను ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి, అతికించి, చంద్రబాబుదని చెబుతున్నారని మండిపడ్డారు. ఆ వాయిస్ ను తాము మీడియాకు ఇవ్వలేదని ఏసీబీ స్పష్టంగా చెబుతోందని, మరి ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.

  • Loading...

More Telugu News