: ఫోన్లు ట్యాప్ చేసిన ఆధారాలు మన దగ్గరున్నాయి... ఎదురు దాడికి దిగండి!: మంత్రులతో చంద్రబాబు


తెలంగాణ ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని... అందువల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగండని ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వారు నోటీసులు ఇస్తే మనం కూడా ఇద్దామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో విజయవాడ మెట్రో రైలును పూర్తిచేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించారు.

  • Loading...

More Telugu News