: గో అహెడ్... టీఎస్ ఏసీబీకి ఎన్నికల కమిషన్ లేఖ


ఓటుకు నోటు వ్యవహారంలో విచారణ కొనసాగించవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ నుంచి లేఖ అందినట్టు ఏసీబీ వర్గాలు ధ్రువీకరించాయి. రేవంత్ రెడ్డి తరపున కోర్టులో వాదిస్తున్న న్యాయవాదులు "ఇది ఈసీకి సంబంధించిన కేసు కాబట్టి వారు మాత్రమే విచారణ జరిపేందుకు అర్హత కలిగివున్నారు. ఏసీబీకి ఇందులో ప్రమేయం లేదు కాబట్టి బెయిలు ఇవ్వండి" అని వాదిస్తున్న సమయంలో ఈ లేఖ రావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టిగేషన్ ను మరింత వేగవంతం చేసే దిశగా ఏసీబీ అధికారులు అడుగులు వేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News