: కేసీఆర్ అరెస్టుకు టీడీపీ డిమాండ్... రాజమండ్రిలో భారీ ఆందోళన
'ఓటుకు నోటు' కేసులో ఆంధ్రప్రదేశ్ నేతల మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేసీఆర్ ను అదుపులోకి తీసుకోవాలంటూ నేడు రాజమండ్రిలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. కోటగుమ్మం సెంటర్ లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జి.బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో పలువురు కార్యకర్తలు ఆందోళన ప్రారంభించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.