: 'పాన్'తో 'పన్ను' చరిత్ర... డేటాబేస్ సిద్ధం చేస్తున్న కేంద్రం


పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) ఆధారిత ఆన్ లైన్ డేటా బేస్ ను కేంద్రం సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు పన్ను పరిధిలోకి వచ్చే లావాదేవీలను సులభంగా తెలుసుకోగలుగుతారని, పన్ను ఎగవేతదారుల సమాచారమూ లభిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్ పర్సన్ అనితా కపూర్ వెల్లడించారు. "దీన్ని ఇన్ కం టాక్స్ బిజినెస్ అప్లికేషన్ గా పిలుస్తున్నాం. ఒకసారి ఇది సిద్ధమై, డేటా బేస్ అందుబాటులోకి వస్తే, ఆదాయపు పన్ను విభాగానికి, పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన ఎంతో సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఇదో సమగ్రమైన సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా సంస్థ లేదా వ్యక్తి జరిపిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలూ ఒక్క పాన్ నంబరు సాయంతో తెలుసుకోవచ్చు" అని ఆమె వివరించారు. ఇది దశల వారీగా అందుబాటులోకి వస్తుందని, 2016 ముగిసేలోగా పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తామని తెలిపారు. దీనికి ఆధార్ అనుసంధానం అవసరం లేదని, పాన్ ఆధారంగా, బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా చూస్తామని తెలిపారు. ఆదాయపు పన్ను శాఖలో పెండింగులో ఉన్న అన్ని కేసులనూ ఆరు నెలలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News