: కేసీఆర్... నీకంటే చంద్రబాబే శక్తిమంతుడు: టీ టీడీపీ నేత మోత్కుపల్లి వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైఖరిపై టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఫైరయ్యారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఛీకొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల సీఎంలను తిడుతూ బతకాలనుకుంటున్న కేసీఆర్ వైఖరి దురదృష్టకరమని ఆయన ఆరోపించారు. భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన కేసీఆర్ రెచ్చగొట్టే రాజకీయాలకు దిగుతున్నారని దుయ్యబట్లారు. కేసీఆర్ కంటే చంద్రబాబుకే ఎక్కువ శక్తి ఉందని మోత్కుపల్లి అన్నారు. గతంలో పదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ కేసీఆర్ లాగా వ్యవహరించలేదన్నారు. ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఆవగింజంతైనా కేసీఆర్ చేయాలని మోత్కుపల్లి హితవు పలికారు.