: చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్ కు నోటీసులిచ్చి, అరెస్ట్ చేయాలి: దేవినేని నెహ్రూ
ఓటుకు నోటు అంశాన్ని పక్కదోవ పట్టించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు తత్వమేమిటో ఈ వ్యవహారంతో అర్థమవుతోందని తెలిపారు. రూ. 50 లక్షలు పెట్టి ఎమ్మెల్యేలను ఎలా కొనాలో భావి తరాలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి, అరెస్ట్ చేయాలని అన్నారు. చేతనైతే సీబీఐ విచారణ జరిపించి, కేసీఆర్ ను దోషిగా తేల్చి... హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలెత్తుకునేలా చేయాలని చంద్రబాబుకు సూచించారు.