: 29న హైదరాబాదుకు రానున్న రాష్ట్రపతి... పది రోజుల విడిది
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెలాఖరు నుంచి పది రోజుల పాటు హైదరాబాదులో విడిది చేయనున్నారు. ఈ నెల 29 నుంచి జులై 8వ తేదీ వరకూ ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సేదదీరనున్నారు. ఆయన వర్షాకాల విడిదిగా రాష్ట్రపతి నిలయాన్ని అధికారులు ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి, కాగా గత ఏడాది శీతాకాల విడిది కోసం ప్రణబ్ డిసెంబర్ చివరి వారంలోనే హైదరాబాదుకు రావాల్సి వుంది. అయితే ఆ సమయంలో గుండె సంబంధిత ఇబ్బందులతో ప్రణబ్ ఇబ్బందులు పడడంతో పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రణబ్, అప్పట్లో హైదరాబాదుకు రాలేదు. దీంతో ఈ వర్షాకాలంలో పది రోజులు ఇక్కడ గడిపేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయానికి మరమ్మతులు చేసి, కొత్త రంగులద్దే పనులు చకచకాసాగుతున్నాయి.