: ఎయిర్ హోస్టెస్ తో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎంపీ పప్పూ యాదవ్
బీహార్ నేత పప్పూ యాదవ్ ఓ విమానంలోని ఎయిర్ హోస్టెస్ తో తప్పుగా ప్రవర్తించినట్టు కేసు నమోదైంది. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది. తాను తినగా మిగిలిన ఆహారాన్ని నడిచే దారిలో వేయవద్దని అన్నందుకు పప్పూ యాదవ్ తిట్లతో అంతెత్తున ఎగిరాడట. సర్ది చెప్పబోయిన ఇతర క్యాబిన్ క్రూపైనా చిందులు తొక్కాడట. ఈ విషయాన్ని ఫ్లయిట్ కెప్టెన్ ఢిల్లీ విమానాశ్రయానికి రిపోర్టు చేస్తూ, విమానంలో ఓ అతిథి ఇబ్బంది పెడుతున్నాడని, సెక్యూరిటీ కావాలని కోరాడట. విమానం ఆగగానే భద్రతా సిబ్బంది వచ్చి పప్పూను తీసుకెళ్లారు. తనపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని పప్పూ చెప్పడం కొసమెరుపు. ఆర్ జేడీ తరపున ఎంపీగా గెలిచిన ఈయనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు రావడంతో, ఈ సంవత్సరం మేలో బహిష్కరణకు గురయ్యారు.