: సచివాలయంలో ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం... ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అజెండా ప్రకారం మద్యం విధానం, గనుల విధానం, వైద్య విధానం అంశాలు మంత్రివర్గ ఆమోదానికి వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే భేటీలో చర్చించనున్నారు. ఏపీలో సీఎం కేసీఆర్ పై నమోదైన 87 కేసులకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఐజీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల సిట్ బృందాన్ని నేడు ఏర్పాటు చేయనున్నారు.