: చంద్రబాబు నోటీసు తీసుకోకపోతే, అది కేసు అవుతుంది: బీజేపీ నేత రఘునందనరావు
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టి.ఏసీబీ నోటీసులిచ్చే పరిస్థితి వస్తే... ఆయన నోటీసులను తీసుకోవడమే మంచిదని టి.బీజేపీ నేత, న్యాయవాది కూడా అయిన రఘునందనరావు సూచించారు. ఒక వేళ చంద్రబాబు నోటీసులు తీసుకోకపోతే అది మరో కేసుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఏసీబీ అధికారులు మేజిస్ట్రేట్ వద్దకు వెళ్తే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, నోటీసులు అందుకున్న తర్వాత దానిపై హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. చంద్రబాబుకు సలహాలు ఎవరు ఇస్తున్నారో కానీ, అవి సరైనవి కాదని అభిప్రాయపడ్డారు.