: వేం నరేందర్ రెడ్డికీ నోటీసులు... అర్ధరాత్రి టీ ఏసీబీ హడావిడి!
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. నిన్న సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు, అర్ధరాత్రి మరింత హడావిడి చేసి ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డికీ నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద జారీ అయిన నోటీసుల ప్రకారం విచారణాధికారి ముందు హాజరుకావాలని సదరు నోటీసుల్లో నరేందర్ రెడ్డిని ఏసీబీ కోరింది. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని క్వార్టర్ నెం.164కు వెళ్లిన ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు అందజేశారు.