: కేసీఆర్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదు: కవిత
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ తెలుగు వార్తా చానల్ తో మాట్లాడారు. నారా లోకేశ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని స్పష్టం చేశారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదులో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది కాలంగా ఆంధ్రా ప్రజలపై ఎక్కడా దాడులు జరగలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంలోకి ఆంధ్రా ప్రజలను, గవర్నర్ ను లాగే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు.