: మరి, ఏపీలో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తారా?: చంద్రబాబుకు ఒవైసీ ప్రశ్నాస్త్రం
హైదరాబాదులో సెక్షన్-8కు పట్టుబడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాలు గవర్నర్ కు అప్పగించాలంటున్నారని, మరి, ఆయన సీఎంగా ఉన్న ఏపీలో శాంతిభద్రతలపై అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తారా? అంటూ ప్రశ్నాస్త్రం సంధించారు. సెక్షన్-8 అమలును హైదరాబాదీలు అంగీకరించరని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేయడం సరికాదని చంద్రబాబుకు హితవు పలికారు. తమకేదైనా నష్టం వాటిల్లిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పబోరని స్పష్టం చేశారు.