: శరద్ పవార్ కూడా సచిన్ లా తప్పుకోవాలి: ఉద్ధవ్ ఠాక్రే
శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై సునిశిత విమర్శలు చేశారు. పవార్ క్రికెట్ పదవుల కోసం ఇంకా పోటీ పడుతున్నారని అన్నారు. దిగ్గజాలుగా పేరొందిన సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ క్రికెట్ నుంచి ఎప్పుడో తప్పుకున్నారని, పవార్ కూడా గౌరవంగా తప్పుకోవాలని పేర్కొన్నారు. బుధవారం ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికల్లో, ఎంసీఏ అధ్యక్షుడైన శరద్ పవార్ కూడా బరిలో ఉన్నారు. పవార్ ప్రత్యర్థిగా విజయ్ పాటిల్ రంగంలో నిలిచారు. పాటిల్ ప్యానెల్ కు శివసేన మద్దతిస్తోంది.