: ఏపీలో దోచుకుని తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారు: రఘువీరా


ఆంధ్రప్రదేశ్ ని టీడీపీ నేతలు హోల్ సేల్ గా దోచుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మిడిల్ లెవెల్ దోపిడీకి పాల్పడుతుంటే, కార్యకర్తలు కింది స్థాయిలో దోచుకుంటున్నారని అన్నారు. ఏపీలో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. మొత్తం 12 అంశాలపై గవర్నర్ కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. వివిధ పథకాలలో దాదాపు 14వేల కోట్ల రూపాయల మేర టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని తెలిపారు. వీటిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే, తాము రుజువు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News