: వేగంగా మారుతున్న సమీకరణాలు... ఏపీ సచివాలయానికి తెలంగాణ భద్రత తొలగింపు


ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఏపీ స్పెషల్ పోలీసు దళాలను రక్షణగా పెట్టాలని బాబు సర్కారు నిర్ణయించింది. ఓటుకు నోటు కేసులో సమీకరణాలు వేగంగా మారిపోతూ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బాబు సర్కారు పలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఏపీ సెక్రటేరియేట్ కు తెలంగాణ పోలీసులే రక్షణ కల్పిస్తుండగా. వారి స్థానంలో ఏపీ పోలీసులను విధులు చేపట్టాలని ఆదేశించారు. చంద్రబాబు కార్యాలయం ఉండే ఎల్ బ్లాక్ చుట్టుపక్కల ఎక్కడా తెలంగాణ పోలీసులు ఉండరాదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. సచివాలయం సెక్యూరిటీ విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లతో మూడు సార్లు భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వారిచ్చిన సలహాల మేరకు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే సీఎం ఇల్లు, క్యాంప్ ఆఫీస్, ఏపీ కార్యాలయాల వద్ద భద్రతను ఏపీ పోలీసులే చూస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News