: చంద్రబాబు అనుక్షణం ఓటుకు నోటు వ్యవహారంపైనే ఆలోచిస్తున్నారు: బొత్స


రాష్ట్ర పాలనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని... కేవలం ఓటుకు నోటు వ్యవహారం గురించే ఆయన ఆలోచిస్తున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లినా కేసు నుంచి ఎలా బయటపడాలనే ఆయన ఆలోచిస్తున్నారని అన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో పార్టీని రక్షించుకోవాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారని... అలాంటప్పుడు ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు కదా? అని అన్నారు. స్వార్థం, స్వలాభం కోసం చంద్రబాబు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News