: చంద్రబాబుకు కాదు... ఓ ఎంపీకి తొలుత నోటీసులు!


ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు బదులు తొలుత ఓ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడికి నోటీసులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వద్ద పట్టుబడ్డ రూ. 50 లక్షలను ఈ నేత స్వయంగా తన కంపెనీ లావాదేవీల ద్వారా సమకూర్చినట్టు తెలంగాణ ఏసీబీ గట్టి సాక్ష్యాధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. వాటి వివరాలను రేవంత్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో భాగంగా ఇప్పటికే న్యాయస్థానానికి అందించిన ఏసీబీ, ఎంపీని ప్రశ్నించి, కేసు వెనక ఉన్న పెద్ద తలకాయలపై మరిన్ని సాక్ష్యాలు సంపాదించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సాయంత్రం ఎంపీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News