: టేపుల్లో గొంతు తనది కాదని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
ఓటుకు నోటు వ్యవహారంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఆడియో టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని చంద్రబాబు చెప్పలేకపోతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్నే చెబుతున్నారని తెలిపారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతే అని తేలితే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు విచారణ ఎదుర్కోవాలని సూచించారు. ఆయన తన సమస్యను తెలుగు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.