: రేవంత్ చాలా ధైర్యంగా ఉన్నారు: మోత్కుపల్లి
చర్లపల్లి జైలులో పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. జైలులో రేవంత్ ను కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే రేవంత్ ను కేసులో ఇరికించారని మోత్కుపల్లి ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలన్న ప్రయత్నం ఫలించదని స్పష్టం చేశారు.