: 'హాత్ వే' బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలో అంతగా ఆకట్టుకోలేకపోతున్నా, ఆదాయంలో మాత్రం దూసుకెళుతోంది. ఇప్పటికే కొత్త రాష్ట్రం తెలంగాణకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆమె, తాజాగా ప్రముఖ బ్రాడ్ బ్యాండ్ సేవల సంస్థ ‘హాత్ వే’కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ మేరకు నిన్న బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశీయ ఇంటర్నెట్ మార్కెటింగ్ లో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్న తాము, అందుకనుగుణంగానే సానియాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.