: కేజ్రీవాల్ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు... ఏసీబీ విచారణ!


ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ సర్కారును మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ఘటన ఇది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేందర్ కుమార్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్రాంచ్)కి ఢిల్లీ డైలాగ్ కమిషన్ (డీడీసీ) మాజీ సభ్యుడు ఆశిష్ జోషి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన ఏసీబీ చీఫ్ ఎంకే మీనాకు లేఖ రాస్తూ, కుమార్ విద్య, ఐటి, ఆరోగ్య విభాగాల కార్యదర్శిగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరారు. దీనిపై స్పందించిన ఏసీబీ అతిత్వరలో కుమార్ కు నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News