: మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల మాఫియా
మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల మాఫియా గుట్టు రట్టైంది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఓ ముఠా విత్తనాలు ప్యాక్ చేసి అమ్ముతున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే విత్తన తయారీ కేంద్రంలో ధరూర్ పోలీసులు ఈరోజు తనిఖీలు చేశారు. ఈ సమయంలో భారీగా నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు నకిలీ విత్తనాల తయారీదారులు రంగారెడ్డి, రాజు పరారయ్యారు.