: బొత్సా, రఘువీరాలకు దేవినేని ఉమ సీరియస్ వార్నింగ్!


ప్రజలు ఛీకొట్టిన కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 5 కోట్ల మంది ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైకాపాకు తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ దుయ్యబట్టారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడచిన పదేళ్ల పాలనలో ఒక్కో నాయకుడు వంద నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తిన్నారని, వీటన్నింటినీ కక్కించేందుకు సీబీఐ అక్కర్లేదని అన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా రఘువీరారెడ్డి తిన్న మేఘమథనం డబ్బును, ఆయన పెదనాన్న శ్రీరామిరెడ్డి మంచినీటి పథకంలో నొక్కేసిన వందల కోట్లను కక్కిస్తామని హెచ్చరించారు. "బొత్సా... ఏసీబీ మద్యం కేసు నీపై ఉంది. శ్రీరంగనీతులు చెబుతున్నావా? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా రాజశేఖరరెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులుగా వెలగబెట్టిన మీరు నేడు ధర్నాలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. ముందు తిన్న డబ్బులు కక్కాలని అన్నారు.

  • Loading...

More Telugu News