: నాగ్ పూర్ లో పర్యటిస్తున్న 'స్వచ్ఛ హైదరాబాద్' కమిటీ
హైదరాబాద్ కు చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో నాగ్ పూర్ లో పర్యటిస్తోంది. ఇక్కడ చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై అధ్యయనం చేస్తున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు నాగ్ పూర్ లో పర్యటిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంలో భాగంగా దేశంలోని అత్యుత్తమ మున్సిపాలిటీల నిర్వహణను నేతల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బృందం నిన్న(సోమవారం) ఢిల్లీలో జహంగీర్ పురిలోని డంపింగ్ యార్డ్, ఓక్లాలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించింది.