: 'డ్రంకెన్ డ్రైవ్'లో తప్పించుకునేందుకు యువతి కొత్త ప్లాన్, అయినా బుక్ చేసిన పోలీసులు


ఫుల్లుగా మందుకొట్టిన ఓ ముంబై యువతి వీధుల్లో హల్ చల్ చేసింది. 'డ్రంకెన్ డ్రైవ్' నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త ప్లాన్ వేసింది. పట్టువీడని పోలీసులు ఆమెను దారికి తెచ్చేందుకు కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, సోమవారం రాత్రి 11 గంటల సమయం... ముంబైలోని బాంధ్రా సమీపంలో పోలీసులు మందుబాబులను బుక్ చేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ కారులో యువతి వచ్చింది. ఆమెను ఆపి తనిఖీ చేస్తే మోతాదుకు మించి మద్యం సేవించినట్టు తెలిసింది. కేసు రాసేలోగా, ఆమె కారులోకి ఎక్కి తలుపులకు లాక్ చేసుకుంది. పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని సిగరెట్లు తాగుతూ ఉండిపోయింది. పోలీసులు ఎంతగా బతిమాలినా తలుపులు తీయలేదు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం గడిచింది. దీంతో పోలీసులకు తిక్కరేగి, కారు డోర్ అద్దాలు పగులగొట్టి మరీ ఆమెను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఆపై కూడా ఆమె పారిపోబోతే, మహిళా పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారు. ఆ కారులో డిస్పోజల్ గ్లాసులు, తాగిపారేసిన సిగరెట్లు కనిపించాయి. ఆమెపై కేసు పెట్టి, ఫైన్ వేసిన తరువాత పోలీసులు హెచ్చరించి పంపారు. ఇదంతా మీడియా కన్నుకు చిక్కింది. ఆమె తిట్లు, మీడియాపై శాపనార్థాలు అన్నీ రికార్డయ్యాయి. ఇప్పుడీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

  • Loading...

More Telugu News