: ఊడిపడిన స్కూల్ బస్సు చక్రం... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
మెదక్ జిల్లాలో నేటి ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. నిండా విద్యార్థులతో బయలుదేరిన ఓ స్కూల్ బస్సు వెనుక టైర్ ఉన్నట్టుండి ఊడిపోయింది. అయితే క్షణాల్లో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్ లో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళుతున్న క్రమంలో బస్సు వెనుక టైర్ ఊడిపోయింది. దీనిని గమనించిన డ్రైవర్ వెనువెంటనే బస్సును నిలిపేశాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు సమాచారం.