: ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించు... లేదంటే పోలీసులకు లొంగిపో: చంద్రబాబుకు హరీశ్ సూచన


ఓటుకు నోటు కేసులో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తన ఫోన్ తో పాటు తన చుట్టూ ఉండే దాదాపు 120 మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ట్యాపింగ్ ఆరోపణలను చంద్రబాబు నిరూపించాలని, లేదంటే పోలీసులకు లొంగిపోవాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లోని గొంతు తనదేనని తేలితే చంద్రబాబు శిక్షకు సిద్ధం కావాలన్న హరీశ్, ఒకవేళ సదరు గొంతు తనది కాదని నిరూపించుకుంటే కనుక, కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News