: కేసీఆర్ కు షాకిచ్చిన అబ్కారీ ఉద్యోగులు...కమిషనర్ నియామకంపై కోర్టుకెక్కిన కానిస్టేబుళ్లు!


తెలంగాణ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లు సీఎం కేసీఆర్ కు షాకిచ్చారు. తమ శాఖ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ నియామకం చెల్లదంటూ హైకోర్టుకెక్కారు. కానిస్టేబుళ్ల పిిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. వివరాల్లోకెళితే... ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక శాఖలను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి చంద్రవదన్, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కేడర్ కు బదిలీ అయ్యారు. తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన అబ్కారీ శాఖ కమిషనర్ గా నియమితులయ్యారు. అయితే ఆయన సదరు పోస్ట్ లో బాధ్యతలు చేపట్టడం ఆ శాఖ ఉద్యోగులకు మింగుడు పడలేదు. దీంతో ఐదుగురు కానిస్టేబుళ్లు హైకోర్టు గడప తొక్కారు. అబ్కారీ శాఖ కమిషనర్ గా చంద్రవదన్ నియామకం చెల్లదని, దీంతో ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News