: లలిత్ మోడీ బ్లాక్ మనీ మాస్టర్... సుష్మను పదవి నుంచి తొలగించాలి: రాహుల్ డిమాండ్
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. లలిత్ మోడీ బ్లాక్ మనీ మాయగాడని, మానవతా దృక్పథంతో సాయం చేశామని మంత్రి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో చేతులు విరిగిన వాళ్లకు సాయం చేయరుగానీ, విదేశాల్లో ఉన్న వ్యక్తికి మాత్రం సాయపడతారని విమర్శించారు. ఛత్తీస్ గడ్ లో మీడియాతో మాట్లాడుతూ... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతిని అడ్డుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపించారు. వీసా విషయంలో లలిత్ మోడీకి సుష్మ సహకరించారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే.