: ఏపీ ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్
ఏపీ రహదారి రవాణా సంస్థ యాజమాన్యం, ఎంప్లాయీస్ యూనియన్ మధ్య వేతన సవరణపై ఒప్పందం కుదిరింది. పేస్కేల్, ఉద్యోగ నిబంధనలు, భత్యాలకు సంబంధించి జరిగిన ఒప్పంద పత్రాలపై ఎండీ సాంబశివరావు, ఈయూ నేతలు సంతకాలు చేశారు. దాంతో ఒప్పంద కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టైంది. ఈ నేపథ్యంలో ఒప్పంద డ్రైవర్ కు రూ.6,519, కండక్టర్ కు రూ.5,966 వేతనం పెరగనుంది. ఎన్ ఆర్ బీఎస్ కు రూ.6 కోట్లు, అలవెన్సులకు రూ.18 కోట్లు మంజూరు చేశారు.