: ఏపీ విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి: మంత్రి రావెల


తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1100 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పును గౌరవించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రి రావెల కిశోర్ బాబు కోరారు. ఈ విషయంలో గవర్నర్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఏపీలో 400 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిని తాము ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదని రావెల పేర్కొన్నారు. తెలంగాణ జెన్ కోలో స్థానికత ఆధారంగా ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై హైకోర్టు స్టే ఇచ్చి, ఉద్యోగుల బదిలీ ప్రక్రియ నిలిపివేయాలని టీ.ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News