: ఎయిడ్స్ చికిత్సలో కీలకమైన ముందడుగు


ఎయిడ్స్ వ్యాధి నివారణ విషయంలో ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణ చేశారు. ఎయిడ్స్‌ నియంత్రణకు ప్రస్తుతం యాంటీ రిట్రో వైరల్‌ చికిత్స పద్ధతి వాడుతున్నారు. అయితే మెదడు రక్తం నిరోధకాలు చాలా సందర్భాల్లో వ్యాధికారక వైరస్‌ను గుర్తించడం లేదు. దాంతో ఫ్లోరిడా శాస్త్రవేత్తలు మ్యాగ్నటో ఎలక్ట్రిక్‌ నానో పార్టికల్స్‌ అనే కొత్త చికిత్స పద్ధతిని కనుగొన్నారు. దీని ద్వారా మందుతోపాటూ మోనోసైట్‌/ మాక్రోఫేజ్‌ అనే సూక్ష్మకణాలను మనిషి శరీరంలోకి పంపుతారు. ఇవి రక్తం ద్వారా మెదడుకు చేరుతాయి. అక్కడ తక్కువ శక్తిగల విద్యుత్తును పంపి.. 97 శాతం హెచ్‌ఐవీ నిరోధక మందును మెదడులోకి విడుదల చేస్తాయి. దీనివల్ల వైరస్‌ మెదడుకు సోకకుండా ఉంటుంది.

ఇదే పద్ధతిని అల్జీమర్స్‌, మూర్చ, వణుకుడు, కండరాల జబ్బులకు కూడా వాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ అద్భుత పరిశోధనల బృందంలో భారతీయ సంతతికి చెందిన మాధవన్‌ నాయర్‌ కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News