: గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ
ఓటుకు నోటు వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ తో మాట్లాడేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సోమవారం మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ తో సమావేశం అయ్యారు. ఆడియో టేపులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక మరికొన్ని రోజుల్లో రానుంది. అటు, చంద్రబాబుకు నోటీసులు పంపేందుకు ఏసీబీ సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ అంశాలపైనే కేసీఆర్ గవర్నర్ తో మాట్లాడనున్నట్టు అర్థమవుతోంది. ముడుపుల కేసు కీలక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో, తెలంగాణ సీఎం గవర్నర్ ను కలవడం ఆసక్తి కలిగిస్తోంది.