: అమెరికాలో టాప్ ఇండియన్ డాక్టర్ హత్య


ఇండియన్ అమెరికన్ కార్డియాలజిస్టు, ప్రపంచంలోనే తొలిసారిగా 'సైమల్టేనియస్ హైబ్రిడ్ రివాస్కులరైజేషన్' శస్త్రచికిత్సను చేసి ఖ్యాతిగాంచిన డాక్టర్ గడసల్లి సురేష్ ను అతని మిత్రుడే కాల్చి చంపాడు. టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సురేష్ వ్యాపార భాగస్వామిగా ఉన్న అయ్యాసామి తంగం ఆయనను కాల్చి చంపాడని, ఆపై అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. వీరి రెండు కుటుంబాలకూ దశాబ్దకాలం నుంచి పరిచయం ఉందని తెలిపారు. ఈ ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని, తంగం ఎందువల్ల సురేష్ ను హత్యచేశాడన్న విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, బెంగళూరుకు చెందిన సురేష్ బెల్గాంలో వైద్య విద్యను, ఆపై యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో కార్డియాలజీని అభ్యసించారు. టెక్సాస్ లోని మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో 1994 నుంచి పనిచేస్తున్నారు. 2008లో 'సూపర్ డాక్టర్'గా అవార్డు అందుకున్నారు.

  • Loading...

More Telugu News