: లంచం అడిగి, రైతు మృతికి కారణమైన తహశీల్దార్ సస్పెన్షన్
కడప జిల్లా నందలూరు మండలంలోని సయ్యద్ మక్బూల్ బాషా అనే రైతు మరణానికి కారణమైన తహశీల్దార్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. ఘటన గురించి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వెంటనే తహశీల్దార్ ను సస్పెండ్ చేశారు. మరోవైపు రైతు బాషా మృతిపై దర్యాప్తు జరిపించాలని ఆర్డీవోను ఆదేశించారు. తన భూమికి పట్టాదారు పాస్ బుక్ కావాలని రైతు వెళితే రూ.4 లక్షలు తనకిస్తేగానీ పనికాదని తహశీల్దార్ తేల్చి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేని ఆ రైతు సెల్ టవరెక్కాడు. అంతపైకి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా రైతు గుండెపోటుతో చనిపోయిన ఘటన కలకలం రేపింది.