: "కొన్నిసార్లు అలా జరుగుతుంది... ఆపలేము" సజీవ దహనంపై యూపీ మంత్రి షాకింగ్ కామెంట్


జర్నలిస్టును సజీవ దహనం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న యూపీ మంత్రి రామ్ మూర్తి వర్మను వెనకేసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గమంతా ప్రయత్నిస్తోంది. తాజాగా యూపీ హార్టీకల్చర్ మినిస్టర్ పరాశ్ నాథ్ యాదవ్ మాట్లాడుతూ, "ప్రకృతితో మనం యుద్ధం చేయగలమా? చేయలేము. కొన్నిసార్లు అలా జరుగుతుంది. మనం ఆపలేము" అని వ్యాఖ్యానించడం పెను విమర్శలకు దారితీసింది. విపక్షాలు తక్షణం రామ్ మూర్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నెల 1వ తేదీన షాజహాన్ పూర్ లో ఓ జర్నలిస్టు కుటుంబంపై పోలీసులతో దాడి చేయించి, అతడి ఒంటికి నిప్పంటించిన కేసులో రామ్ మూర్తి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తీవ్రగాయాలతో మరణించే ముందు బాధితుడు వాంగ్మూలమిస్తూ, తనకు నిప్పు పెట్టింది రామ్ మూర్తేనని చెప్పడంతో ఆయనపై కేసు బిగుసుకుంది.

  • Loading...

More Telugu News