: ఏపీలో అంగన్ వాడీల జీతాల పెంపుకు ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల జీతాలు పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు సమావేశమైన ఉపసంఘం అంగన్ వాడీల సమస్యలు, జీతాల పెంపుపై చర్చించింది. ఏపీ సచివాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు యనమల రామకృష్ణుడు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. జీతాల పెంపుకు దాదాపుగా అంగీకరించినా, ఎంత మేరకు పెంచాలన్న దానిపై స్పష్టత రాలేదు. దానిపై అధ్యయంన చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో త్వరలో మరోసారి ఉపసంఘం భేటీ అవ్వనుంది. అయితే అంగన్ వాడీల పనితీరుపై ఉపసంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.