: ఏపీ కాంగ్రెస్ కదిలింది!
రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని కనీసం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటునూ గెలవలేకపోయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, సంవత్సరం తరువాత ఓ నిరసన ప్రదర్శనకు కదలివచ్చారు. ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ, ఈ ఉదయం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరసన తెలిపారు. "అవినీతికి బాస్ చంద్రబాబే" అంటూ దీక్ష మొదలుపెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనపై దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ, కిల్లి కృపారాణి, శైలజానాథ్, దేవినేని రాజశేఖర్, మల్లాది విష్ణు, పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు.