: యోగాసనాలతో ఉపశమనం పొందుతున్న ఎయిర్ ఇండియా సిబ్బంది


నింగిలో ప్రయాణికులకు సేవలందిస్తూ, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మానసిక ఒత్తిడి కూడా తీవ్రంగానే ఉంటుంది. దీంతో, తమ సిబ్బందికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభింపజేసేందుకు 'యోగా'నే బెటర్ అని ఎయిర్ ఇండియా యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో, హైదరాబాదులోని 'ఎయిర్ ఇండియా సెంటర్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్ మెంట్' యూనిట్లో యోగా క్లాసులు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యూనిట్లో 300 మంది క్యాబిన్ సిబ్బంది, 80 మంది పైలట్లు యోగా క్లాసులకు హాజరవుతున్నారు. ఆసనాలతో తమ సిబ్బంది ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News