: 'ఓక్యులస్'లో ఆ తరహా యాప్స్ ఉండవంటున్న ఫేస్ బుక్


వర్చువల్ రియాలిటీ (కాల్పనిక వాస్తవికత) నిండిన యాప్స్ ప్రధాన లక్ష్యంగా తాము ప్రారంభించిన కొత్త సంస్థ 'ఓక్యులస్'లో సెక్స్ కు సంబంధించిన గేమ్స్ అసలు ఉండవని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. అత్యంత సురక్షితంగా, ఆహ్లాదకర వాతావరణంలో మరింత గేమింగ్ అనుభూతిని పొందేలా ఓక్యులస్ యాప్స్ మార్చి 2016లోగా అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం సొంతంగా యాప్ స్టోర్ ను కూడా నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇక్కడి నుంచి వర్చువల్ రియాలిటీ ప్రాధాన్యత గల గేమ్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించింది. కల్పిత లైంగికానందాన్ని ఇచ్చే యాప్స్ కు ఇందులో స్థానం లేదని వివరించింది. ఇదే సమయంలో నెటిజన్ల, ముఖ్యంగా చిన్నారుల మనసులను చెరిపే హింసాత్మక గేమ్స్ విషయంలో ఓక్యులస్ ఏ విధంగా స్పందిస్తుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విడియో గేమ్స్, అందునా స్మార్ట్ ఫోన్ యాప్ లలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. షూటర్ గేమ్స్, ఫైటింగ్ గేమ్స్ లోని హింస, మానసిక పరివర్తనపై ప్రభావం చూపుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News