: పరీక్షల్లో పాస్ శాతం తగ్గిందని పాఠశాలకు తాళం వేశారు!
సాధారణంగా పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే విద్యార్థులపై తల్లిదండ్రులు మండిపడుతుంటారు. కానీ ఇక్కడలా జరగలేదు. దానంతటికీ అసలు కారణంగా పాఠశాల యాజమాన్యంపై తమ కోపం వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షల్లో చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులలో 32 శాతం మంది మాత్రమే పాసయ్యారు. అంత తక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చిందన్న ఆగ్రహంతో ఈరోజు ఉదయం పిల్లల తల్లిదండ్రులు ఆ పాఠశాలకు తాళం వేసేశారు. మరోవైపు విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.