: నేపాల్ లో 316వ సారి భూప్రకంపనలు
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ ను భూకంపం వెంటాడుతూనే ఉంది. ఈ రోజు ఉదయం రెండు ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో భూమి కంపించింది. నువాకోట్ జిల్లా, డోలఖా జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 4.2, 4.1గా నమోదైంది. ఏప్రిల్ 25 తరువాత నాలుగుకుపైగా భూకంప తీవ్రతతో ఇప్పటివరకు 316 సార్లు నేపాల్ లో భూమి కంపించింది.